ములుగు: రాష్ట్రంలో భూసేకరణ, పునరావాసం –పునరావాస పునరుద్ధరణ (ఆర్‌అండ్‌ఆర్), అటవీ సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొన్నారు. ప్రాజెక్టుల వారీగా అవసరమైన భూసేకరణ, పెండింగ్‌లో ఉన్న ఆర్‌అండ్‌ఆర్ చెల్లింపులను గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు.
● వీసీలో రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి
ఉత్తమ్‌కుమార్ రెడ్డి


