● సమ్మక్కసాగర్ బ్యారేజీలోకి 4,96,300క్యూసెక్కుల నీరు
కన్నాయిగూడెం: గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో మండల పరిధిలోని తుపాకులగూడెం గోదావరిపై ఉన్న సమ్మక్క సాగర్ బ్యారేజీలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలోకి 4,96,400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. సోమవారం వరకు 1,20,300 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరగా మంగళవారం ఒక్కరోజే సుమారుగా 3,76,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ 59 గేట్లను ఎత్తి 4,90,300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు తెలిపారు.
సమ్మక్కసాగర్ బ్యారేజీ వద్ద వరద ఉధృతి


