ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

గోవిందరావుపేట: ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ సిబ్బందికి సూచించారు. మండల పరిధిలోని పస్రా పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా ఎస్పీ మంగళవారం సందర్శించారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాఫ్తు పురోగతి, స్టేషన్‌ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్‌ కేసుల వివరాలపై ఎస్పీ సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై వేగంగా స్పందించి, పారదర్శకంగా విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని సిబ్బందికి సూచించారు. అలాగే స్టేషన్‌ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, గంజాయి, ఇతర అక్రమ కార్యకలాపాలపై నిఘా మరింత పెంచాలని ఆదేశించారు. విధుల్లో అంకితభావం, క్రమశిక్షణతో పనిచేసి పోలీస్‌ శాఖపై ప్రజల్లో మరింత నమ్మకం పెంచాలని సూచించారు. పోలీస్‌ స్టేషన్‌లో సీజ్‌ చేసిన వాహనాల రికార్డులను పరిశీలించారు. అలాగే రౌడీ షీటర్లు, సస్పెక్ట్‌ షీటర్ల కదలికలను గమనించాలని ఆదేశించారు. అనంతరం స్టేషన్‌ సిబ్బందిని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు డీఎస్పీ ఎన్‌.రవీందర్‌, పస్రా సీఐ దయాకర్‌, ఎస్సై తాజొద్దీన్‌, స్టేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement