అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అధిక వసూళ్లకు పాల్పడితే చర్యలు

Aug 26 2026 1:06 AM | Updated on Aug 26 2026 1:06 AM

ఏటూరునాగారం: మండల పరిధిలోని మీసేవ, ఆథార్‌ కేంద్రాల్లో అధిక వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఈ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ దేవేందర్‌ హెచ్చరించారు. మండలకేంద్రంలోని మీసేవ, ఆథార్‌ కేంద్రాలను తహసీల్దార్‌ జగదీశ్వర్‌తో కలిసి ఆయన మంగళవారం తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు వ్యతిరేకంగా దరఖాస్తుదారుల నుంచి అధిక రుసుము వసూలు చేస్తే నిర్వాహకుల సస్పెన్షన్‌తో పాటు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. పలు మీసేవ, ఆధార్‌ కేంద్రాల్లో అధిక రసుము వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు తరుచుగా వస్తున్నాయని నిర్వాహకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులు అందుబాటులో ఉంటూ దరఖాస్తుదారులతో మర్యాదగా వ్యవహరిస్తూ ఈఎస్‌డీ నిబంధనలను పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మీసేవ జిల్లా మేనేజర్‌ పోలోజు విజయ్‌, సెంటర్ల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఈ డిస్ట్రిక్ట్‌ మేనేజర్‌ దేవేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement