రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

Aug 25 2026 1:03 AM | Updated on Aug 25 2026 1:03 AM

ఏటూరునాగారం: మండలకేంద్రంలోని స్థానిక ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థులు ఈనెల 19, 20వ తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్రస్థాయి జిజ్ఞాస స్టూడెంట్‌ స్టడీ ప్రాజెక్ట్‌ ప్రదర్శన పోటీల్లో ఉత్తమ ప్రదర్శన కనబర్చినట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ రేణుక తెలిపారు. సోమవారం మండలకేంద్రంలోని కళాశాలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చరిత్ర, తెలుగు, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల విద్యార్థులు పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిజ్ఞాస కోఆర్డినేటర్‌ జీవవేణి, విభాగాల అధిపతులు వెంకటయ్య, సంపత్‌, శ్రీధర్‌, అధ్యాపకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement