ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక నిఘా

Aug 25 2026 1:03 AM | Updated on Aug 25 2026 1:03 AM

న్యూస్‌రీల్‌

మంగళవారం శ్రీ 25 శ్రీ ఆగస్టు శ్రీ 2026

గంజాయి

రవాణాపై

జిల్లాలో మత్తు పదార్థాల నివారణే లక్ష్యం

పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు

యువత మత్తుకు

దూరంగా ఉండాలి

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

‘సాక్షి’ ఫోన్‌ఇన్‌

కార్యక్రమానికి విశేష స్పందన

ప్రశ్న: యువత గంజాయి మత్తులో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేస్తు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. – శ్రీనివాస్‌, ఏటూరునాగారం

జవాబు: డ్రంకెన్‌ డైవ్‌ నిర్వహిస్తాం. మత్తు పదార్థాలు సేవిస్తే చర్యలు తీసుకుంటాం. రాత్రి సమయంలో పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో పైట్రోలింగ్‌తో పాటు డ్రంకెన్‌ డ్రైవ్‌ టెస్టులు నిర్వహించి శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

ములుగు రూరల్‌: జిల్లాలో గంజాయి రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, మత్తు పదార్థాల నివారణే లక్ష్యంగా పోలీస్‌శాఖ పని చేస్తుందని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. ఈ మేరకు సాక్షి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. పలువురు అడిగిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానం ఇచ్చారు. మత్తు పదార్థాల రవాణా, వినియోగం, దుష్పలితాలు, నిర్మూలనకు పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తుకు బానిసై బంగారు భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దన్నారు. మత్తుకు బానిసైన వారిని తిరిగి మాములుగా మార్చేందుకు కౌన్సెలింగ్‌తో పాటు రియాబిటేషన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు.

ప్రశ్న: గంజాయికి అలవాటుపడిన వారిని మాన్పించేందుకు రియాబిటేషన్‌ సెంటర్‌ ఎక్కడఉంది. – జెట్టి శ్రీను, వెంకటాపురం(కె)

జవాబు: మత్తు పదార్థాలకు అలవాటుపడిన వారిని మాన్పించేందుకు జిల్లా కేంద్రంలో రియాబిటేషన్‌ కేంద్రం ఉంది. ములుగు ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రిలో కొనసాగుతోంది. మీ ప్రాంతంలో ఎరైన ఉన్నట్లయితే వారికి సమాచారం అందించండి.

ప్రశ్న: జిల్లాకేంద్రంలో యువత మత్తు పదార్థాల వినియోగం రాత్రి సమయంలో ఎక్కువగా ఉంది. – ముంజాల భిక్షపతి, ములుగు

జవాబు: రాత్రి సమయంలో యువత గుంపులుగా కలిసి సిగరెట్లు, మద్యం, గంజాయి వంటివి సేవించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటాం. పోలీస్‌ పెట్రోలింగ్‌ పెంచుతాం.

ప్రశ్న: మేడారం వచ్చే టూరిస్టులు ఇక్కడి యువతకు మత్తు పదార్థాలను అలవాటు చేస్తున్నారు. – ఎనగంటి నరేష్‌, నార్లాపూర్‌

జవాబు: మేడారం వచ్చే ఇతర రాష్ట్రాలు, పట్టణ ప్రాంతాల టూరిస్టులపై లోకల్‌ పోలీస్‌లతో స్పెషల్‌ ఫోకస్‌ పెట్టిస్తాం. యువత మత్తుకు దూరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది.

ప్రశ్న: గ్రామాల్లో విచ్చిలవిడిగా గుడుంబా తయారీ అమ్మకాలు చేపడుతున్నారు.

– సావర్తి ధర్మేందర్‌, వెంకటాపురం(ఎం),

భిక్షపతి, కన్నాయిగూడెం

జవాబు: గ్రామాల్లో గుడుంబా తయారీ, నిర్మూలనకు చర్యలు తీసుకుంటాం. పోలీస్‌శాఖ, ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి గుడుంబా నియంత్రణ చేపడతాం.

ప్రశ్న: ఇసుక లారీలు అధికలోడ్‌తో వెళ్లడంతో రోడ్లు పూర్తిగా ధ్వంసమవుతున్నాయి. చర్యలు తీసుకోవాలి. –నరేష్‌, మంగపేట

జవాబు: అధిక లోడ్‌తో వెళ్లే వాహనాలను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటాం. వాహనదారులకు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించి రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడతాం.

ప్రశ్న: ప్రభుత్వ పాఠశాలల ఆవరణాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. చర్యలు తీసుకోవాలి. – హరీష్‌, వెంకటాపురం(ఎం)

జవాబు: ప్రభుత్వ పాఠశాల వద్ద మద్యం సేవించకుండా రాత్రి సమయంలో పోలీసులు పెట్రోలింగ్‌ నిర్వహిస్తాం. అలాగే పాఠశాల పరిసరాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement