● వీసీలో మంత్రి కొండా సురేఖ
ములుగు: వన మహోత్సవంలో భాగంగా జిల్లాలకు నిర్దేశించిన మొక్కలు నాటే లక్ష్యాలను సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేసేలా సమగ్ర కార్యాచరణ రూపొందించాలని మంత్రి కొండా సురేఖ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం వన మహోత్సవం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, డీఎఫ్‌ఓ వికాస్ మీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ నిర్దేశించిన లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వీసీ అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ వన మహోత్సవ కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేసి, జిల్లాలో నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.
27న పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామసభలు
ఆగస్టు 27న రాష్ట్రంలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. సోమవారం ఎస్‌ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీసీ ద్వారా సమీక్ష నిర్వహించారు. జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్‌న్‌హాల్ నుంచి కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు, ఆర్డీఓ కృష్ణవేణితో కలిసి వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా నోటీసుల జనరేషన్ ప్రక్రియను వేగవంతం చేసి, పూర్తి చేస్తున్నామన్నారు. 27న గ్రామసభలు, వార్డు సభలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ వీసీలో సూపరింటెండెంట్, ఎలక్షన్ వింగ్ ఎండీ. సలీం ఉద్దీన్, నాయబ్ తహసీల్దార్ (ఎలక్షన్) ఎం. నితీష్ తదితరులు పాల్గొన్నారు.


