ములుగు: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారులు అందించిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం నూతన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీఓసీ) లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు సీహెచ్. మహేందర్ జీ, ఎం.సంపత్ రావులతో కలిసి అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 44 దరఖాస్తులు రాగా భూమికి సంబంధించినవి 15, ఇందిరమ్మ ఇళ్లు 4, పింఛన్లు 7, ఇతర శాఖలకు సంబంధించినవి 18 దరఖాస్తులు అందాయి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను సమగ్రంగా పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని, ప్రజలకు జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ రవి కుమార్, ఆర్డీఓ కృష్ణవేణి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు
ప్రజావాణిలో కలెక్టర్, గిరిజన దర్బార్‌లో ఐటీడీఏ పీఓ వినతుల స్వీకరణ


