ములుగు: అక్షరాస్యతలో జిల్లాను అగ్రభాగాన నిలపాలని అదనపు కలెక్టర్ సంపత్‌రావు అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్ కాన్ఫరెన్స్‌హాల్‌లో తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్) పోస్టర్‌ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. అలాగే టాస్, ఉల్లాస్ కార్యక్రమాలకు సంబంధించిన సమన్వయ సమీక్ష సమావేశం డీఈఓ సిద్ధార్థరెడ్డి అధ్యక్షతన గురువారం నిర్వహించగా ఆయన హాజరై మాట్లాడారు. టాస్, ఉల్లాస్ కార్యక్రమాలను సామాజిక బాధ్యతగా తీసుకొని లక్ష్యాల సాధనకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. టాస్ అడ్మిషన్ల పెంపుపై ప్రతిరోజూ సమీక్షించాలన్నారు. ఎంఈఓలు, ఏపీఎంలు, ఏఐ కోఆర్డినేటర్లు తప్పనిసరిగా ప్రతిరోజూ అడ్మిషన్ల పెంపునకు పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో వయోజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ తుమ్మ రమేశ్‌రెడ్డి, ప్రాజెక్ట్ ఆఫీసర్ పుల్లూరు వేణుగోపాల్, డీఆర్‌డీఏ ఏపీడీ గొట్టే శ్రీనివాస్, టాస్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం, ఉల్లాస్ జిల్లా కోఆర్డినేటర్ పీర్ల కృష్ణ బాబు తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ సంపత్‌రావు


