ములుగు రూరల్: రైతులు వరిసాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని ఉద్యానవనశాఖ అధికారి సంజీవరావు అన్నారు. ఈ మేరకు బుధవారం మల్లంపల్లి మండలంలోని వ్యవసాయ క్షేత్రాలను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సంమృద్ధిగా కురవని కారణంగా రైతులు నీటి సాంద్రత తక్కువ వినియోగం ఉన్న పంటలు కూరగాయలు, పుప్పుదినుసులు, ఆయిల్ సీడ్స్, పండ్ల తోటలు సాగు చేయాలన్నారు. రైతులు సాగు చేస్తున్న కూరగాయ తోటలు, మిర్చి నారు మడులను, బంతితోటలను సందర్శించి రైతులకు సూచనలు చేశారు. ఉద్యానవనశాఖ రైతులకు డ్రిప్, తుంపర్ల పరికరాలు సబ్సిడీపై అందింస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు పంటల సాగు విధానంపై వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త విశ్వతేజ, ఆత్మ చైర్మన్ రవీందర్‌రెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేశ్‌కుమార్, హెచ్‌ఓ శ్రీకాంత్, ఏఓ శ్రీధర్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు.


