హెల్త్‌ ఏటీఎం సేవలు | - | Sakshi
Sakshi News home page

హెల్త్‌ ఏటీఎం సేవలు

Aug 16 2026 5:27 AM | Updated on Aug 16 2026 5:27 AM

హెల్త్‌ ఏటీఎం మిషన్‌ సేవలు పొందండి

కాళేశ్వరం: మహదేవపూర్‌ సీహెచ్‌సీలో జూలై 31న ప్రారంభమైన హెల్త్‌ ఏటీఎం సేవలు కాటారం డివిజన్‌ ప్రజలకు ఉపయోగకరంగా మారాయి. హెల్త్‌ ఏటీఎం ద్వారా 64 వ్యాధులకు 15 రకాల పరీక్షలు నిర్వహించి వెంటనే రిపోర్టులు అందజేస్తున్నారు. రోగులు కాటారం, భూపాలపల్లి, పరకాల, మంచిర్యాల, హనుమకొండ లాంటి పట్టణాలకు వెళ్లకుండా ప్రజలకు సమ యం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతున్నాయి.

చేసే పరీక్షలు ఇవే..

ఎత్తు, బరువు (శరీర కొవ్వు విశ్లేషణ), రక్తపోటు, రక్తంలోని ఆక్సిజన్‌ శాతం, శరీర ఉష్ణోగ్రత, ఈసీజీ, హీమోగ్లోబిన్‌, రక్తంలో చక్కెర, యూరిక్‌ యాసిడ్‌, లిపిడ్‌ ప్రొఫైల్‌ (కొలెస్ట్రాల్‌ పరీక్ష), హెచ్‌బీఏ1సీ (గత 2–3 నెలల సగటు చక్కెర స్థాయి), స్పైరోమీటర్‌ (ఊపిరితిత్తుల పనితీరు) పరీక్ష, ఆటో స్కోప్‌ (చెవి పరీక్ష), డెర్మా స్కోప్‌ (చర్మ పరీక్ష), డెంటల్‌ కెమెరా (దంతాల పరీక్ష) ఈ విధమైన 15 పరీక్షలు హెల్త్‌ ఏటీఎంలో కొద్ది నిమిషాల్లోనే అనేక ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. ఏటీఎం మిషన్‌ వద్ద వ్యక్తి కూర్చొని, నిలబడి ఉండటం, రక్త పరీక్షల ద్వారా పరీక్షలు చేస్తున్నారు. 15 నిమిషాల నుంచి 25 నిమిషాల్లో పరీక్షల రిపోర్టులు అందజేస్తున్నారు.

ఏ రోజు ఎన్ని

పరీక్షలు చేశారంటే..

జూలై 31 9

ఆగస్టు 1 2

ఆగస్టు 4 10

ఆగస్టు 5 4

ఆగస్టు 6 7

ఆగస్టు 10 1

ఆగస్టు 12న 9

హెల్త్‌ ఏటీఎంతో త్వరగా పరీక్షలు తెలుసుకోవచ్చు. 15 రకాల పరీక్షలకు అనుసంధానంగా ఉన్న 64 రకాల పరీక్షలు తెలుసుకోవచ్చు. మారుమూల ప్రాంతంలో ఇలాంటి హెల్త్‌మిషన్‌ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. టెక్నిషియన్‌ అందుబాటులో ఉన్నారు. పూర్తిగా ఉచితంగా సేవలు అందుబాటులో ఉన్నాయి.

– విద్యావతి, సూపరింటెండెంట్‌,

మహదేవసూర్‌ సీహెచ్‌సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement