స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి

Aug 14 2026 7:44 AM | Updated on Aug 14 2026 7:44 AM

ములుగు రూరల్‌: స్వాతంత్య్ర సమరయోధుల తాగ్యాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మూగ జయశ్రీ అన్నారు. ఈ మేరకు గురువారం బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లాకేంద్రంలో ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రారంభించిన తిరంగ్‌ ర్యాలీ కలెక్టరేట్‌ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యువత దేశం పట్ల జాతీయతా భావం కలిగి ఉండాలన్నారు. విద్యతో పాటు దేశభక్తి, సేవాభావం, సామాజిక బాధ్యత అలవర్చుకోవాలన్నారు. ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. ఈ ర్యాలీలో విద్యార్థులు నినాదాలు చేయడంతో పాటు వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, నాయకులు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణవేణి నాయక్‌, భూక్య జవహర్‌లాల్‌, రాజునాయక్‌, స్వరూప, కృష్ణాకర్‌, రవీందర్‌రెడ్డి, నరేష్‌, తేజరాజు, సునీల్‌, రాజ్‌కుమార్‌, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement