అర్జీలను పరిష్కరిస్తాం.. | - | Sakshi
Sakshi News home page

అర్జీలను పరిష్కరిస్తాం..

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో వచ్చిన వినతులను పరిశీలించి ఉన్నతాదికారుల ఆదేశాల మేరకు పరిష్కరిస్తామని ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్‌ దబ్బగట్ల జనార్దన్‌ అన్నారు. ఈ మేరకు ఐటీడీఏలో సోమవారం నిర్వహించిన గిరిజన దర్బార్‌లో పది మంది గిరిజనుల నుంచి డీడీ వినతులు స్వీకరించారు. ఈ నెల 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జన సమీకరణకు నిధులు అందజేయాలని గిరిజన సంఘాల నాయకులు డీడీకి మొరపెట్టుకున్నారు. ఏటూరునాగారం మండలం షాపెల్లిలో ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా బుక్కు పోయిందని, దాని స్థానంలో మరో కొత్త బుక్కు ఇవ్వాలని ఓ గిరిజనుడు విన్నవించుకున్నాడు. ఖానాపురం మండలంలోని కోమటిపల్లికి చెందిన గిరిజన రైతు తనకు ఉన్న భూమిలో వేరే ఒకరు దున్నుకుంటున్నారని, ఆక్రమించుకున్నాడని, ఈ విషయంపై కోర్టులో కేసు వేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గిరిజన రైతు మొరపెట్టుకున్నారు. ఇలా పలువురు తమతమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ డీడీకి వినతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌, డీటీ అనిల్‌, జేడీఎం కొండల్‌రావు, సురేశ్‌, ఎకై ్సజ్‌ సీఐ కిశోర్‌, జీసీసీ డీఎం వాణి, పెసా కోఆర్డినేటర్‌ ప్రభాకర్‌, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌రెహమాన్‌ పాల్గొన్నారు.

ఐటీడీఏ డీడీ జనార్దన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement