● ఇసుకవాగు వద్ద పడవే దిక్కు
● శ్రీరామ్‌నగర్ నుంచి వస్తున్న వాహనాలు
● జేసీబీ సాయంతో వాగు దాటింపు
వాజేడు: మండల పరిధిలోని చీకుపల్లి, పెద్దగొళ్లగూడెం గ్రామాల మధ్యన డైవర్షన్ రహదారి కొట్టుకు పోవడంతో ప్రయాణ కష్టాలు ఏర్పడ్డాయి. గతనెల 29న కురిసిన వర్షాలతో రహదారి కొట్టుకుపోగా గోదావరి వరదతో రహదారి మొత్తం మునిగిపోయింది. ఇటీవల రహదారి బయట పడినా డైవర్షన్ దారి వేయడానికి అనుకూలంగా లేదు. దీంతో అక్కడికి వచ్చిన ప్రయాణికులను నాటు పడవల్లో దాటిస్తున్నారు. అలాగే చెరుకూరు నుంచి శ్రీరామ్ నగర్, కోయ వీరాపురం మీదుగా చీకుపల్లి వరకు పాత ఆర్‌అండ్‌బీ రహదారి ఉంది. ఇది వాడకంలో లేకపోవడంతో మరమ్మతులకు గురైంది. కాని ఇసుక వాగు వద్ద డైవర్షన్ రహదారి కొట్టుకుపోవడంతో పాత ఆర్‌అండ్‌బీ రహదారే దికై ్కంది. శ్రీరామ్‌నగర్, కోయవీరాపురం గ్రామాల మధ్యన రహదారిపై ముష్టివాగు, రాళ్లవాగు ఉన్నాయి. ఎంత పెద్ద వరద వచ్చినా ఇక్కడి నుంచి వాహనాలు వెళ్లే అవకాశం ఉంది. దీంతో ఈ వైపుగా గత ఐదు రోజులుగా వాహనాలు వస్తూనే ఉన్నాయి. లారీలు సైతం ఎక్కువగా వస్తుండడంతో వాగులో చిక్కుకుంటున్నాయి. దీంతో సోమవారం అటుగా వచ్చిన ఓ భారీ లారీ వాగులో చిక్కుకుపోవడంతో రెండు జేసీబీలతో లారీని బయటకు నెమ్మదిగా తీసుకొచ్చారు.


