RêMîS MöË$Ð]l#-ÌZÏ ˘ ఉమ్మడి వరంగల్‌కు భారీ వాటా1,117 పోలీస్‌, ఫైర్‌, జైలు ఉద్యోగాలు | - | Sakshi
Sakshi News home page

RêMîS MöË$Ð]l#-ÌZÏ ˘ ఉమ్మడి వరంగల్‌కు భారీ వాటా1,117 పోలీస్‌, ఫైర్‌, జైలు ఉద్యోగాలు

Aug 4 2026 12:53 AM | Updated on Aug 4 2026 12:53 AM

ఉమ్మడి వరంగల్‌లో మొత్తం పోస్టులు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

పోలీస్‌, అగ్నిమాపక, జైళ్ల శాఖల్లో కొలువు కోసం ఎదురుచూస్తున్న యువతకు భారీ అవకాశాలు వచ్చాయి. తాజా నియామకాల్లో ఉమ్మడి వరంగల్‌ ప్రాంతానికి సంబంధించి కానిస్టేబుల్‌, ఫైర్‌ ఫైటర్‌, జైలు వార్డర్‌ పోస్టులు కలిపి 1,117 ఖాళీల భర్తీగా నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. ఇందులో వివిధ కేడర్లకు చెందినవి అత్యధికంగా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో 656 పోస్టులు ఉండగా.. ములుగు 189 పోస్టులతో రెండో స్థానంలో ఉంది. జయశంకర్‌ భూపాలపల్లికి 126, మహబూబాబాద్‌కు 106 పోస్టులు దక్కాయి. వీటితోపాటు ఎస్‌ఐ, ఆర్‌ఎస్‌ఐ, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌, డిప్యూటీ జైలర్‌ తదితర పోస్టుల్లో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మరో 101 అవకాశాలు ఉన్నాయి.

మనదే అత్యధిక వాటా..

పోలీస్‌ కొలువుల్లో ఉమ్మడి జిల్లాకు అత్యధిక అవకాశాలున్నాయి. కానిస్టేబుల్‌ పోస్టుల్లో సివిల్‌ 721, ఏఆర్‌ 260 కలిపి మొత్తం 981 పోస్టులు ఉన్నాయి. అగ్నిమాపక శాఖలో 92 ఫైర్‌ ఫైటర్‌ పోస్టులు, జైళ్ల శాఖలో 42 పురుష వార్డర్‌, 2 మహిళా వార్డర్‌ పోస్టులున్నాయి. ఈ మూడు విభాగాల్లో 1,117 పోస్టులు ఉండడం నిరుద్యోగ యువతకు ఊరటనిస్తోంది. ఇందులో వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో అత్యధికంగా 656 పోస్టులున్నాయి. ఇందులో 500 సివిల్‌ కానిస్టేబుల్‌, 129 ఏఆర్‌ కానిస్టేబుల్‌, 15 ఫైర్‌ ఫైటర్‌, 11 పురుష వార్డర్‌, ఒక మహిళా వార్డర్‌ పోస్టు ఉ న్నాయి. ములుగులో 189 పోస్టులు ఉండగా.. భూ పాలపల్లిలో 126, మహబూబాబాద్‌లో 106 పోస్టులు ఉన్నాయి. ఫైర్‌ ఫైటర్‌ పోస్టుల్లోనూ ములుగు 25 పోస్టులతో ముందంజలో ఉంది. జనగామలో 16, వరంగల్‌ కమిషనరేట్‌, భూపాలపల్లిలో 15 చొప్పున, మహబూబాబాద్‌లో 14, హనుమకొండలో 7 పోస్టులు ఉన్నాయి.

సివిల్‌ కానిస్టేబుల్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌

ఫైర్‌ ఫైటర్‌ వార్డర్‌ పురుషులు

వార్డర్‌ మహిళలు

వరంగల్‌ కమిషనరేట్‌ పరిధిలో 656

ములుగుకు ప్రాధాన్యం కింద

189 పోస్టులు..

మూడు జోన్లలో మరో 101 మందికి

అవకాశాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement