చైర్‌పర్సన్ ఎవరో?
● రేసులో స్వాతి, చంద్రకళ
● ఇరువురి మధ్య నెలకొన్న పోటీ
● 16న చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక
ములుగు: ములుగు మున్సిపాలిటీ తొలి పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకునేందుకు సన్నద్ధమైనప్పటికీ చైర్‌పర్సన్ పదవి ఎవరికి దక్కనుందో చూడాలి. ప్రధానంగా నల్లెల్ల స్వాతి, చింతనిప్పుల చంద్రకళ మధ్య పోటీ నెలకొంది. కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించి పార్టీ విధేయుడిగా పేరొందిన మాజీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి కోడలు స్వాతి పదవిని ఆశిస్తున్నారు. గత 20 ఏళ్లుగా పార్టీలో ఉంటూ సీతక్క అనుచురుడిగా గుర్తింపు పొందిన చింతనిప్పుల భిక్షపతి సతీమణి చంద్రకళ సైతం చైర్‌పర్సన్ రేసులో ఉండడంతో ఇరువురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎంపికను మంత్రి సీతక్కనే ఫైనల్ చేస్తుందని, సీతక్క మాటకు, పార్టీకి కట్టుబడి ఉన్నామ ని కౌన్సిలర్లు, పార్టీ నాయకులు చెబుతున్నారు.
క్యాంపునకు తరలివెళ్లిన కౌన్సిలర్లు
ములుగు మున్పిపాలిటీ చైర్‌పర్సన్ పదవిని కాంగ్రెస్ పార్టీ నుంచి స్వాతి, చంద్రకళతో పాటు మాజీ సర్పంచ్ బండారి నిర్మల, మాజీ ఉప సర్పంచ్ వంగ సుమలత కూడా ఆశించారు. మున్సిపల్ ఎన్నికల్లో నిర్మల, సుమలత ఓటమి చెందడంతో స్వాతి, చంద్రకళ మధ్య పోటీ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 12 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ ముఖ్య నాయకులు క్యాంపునకు వెళ్లినట్లు సమాచారం. ఈ నెల 16న చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌కు ఎన్నిక జరగనుంది.
నల్లెల్ల స్వాతి
చింతనిప్పుల చంద్రకళ
చైర్‌పర్సన్ ఎవరో?


