తల్లుల దీవెనలతో ప్రజలకు సేవ చేస్తాం
● స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మల తల్లుల దీవెనలతో ప్రజలకు మరింత సేవ చేస్తానని మాజీ ఉప ముఖ్యమంత్రి,స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. నూతనంగా ఎన్నికై న స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లతో కలిసి ఆయన శనివారం అమ్మవార్లను దర్శించుకుని పూజలు నిర్వహించారు. అమ్మవార్లకు ఎత్తు బంగారం, చీరసారె, పసుపు, కుంకుమ, పూలు, పండ్లు సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలకు మరింత సేవ చేయాలని సంకల్పించామని తెలిపారు. ఆలయ సంప్రదాయ ప్రకారం దేవాదాయశాఖ అధికారులు, పూజారులు కడియం శ్రీహరితోపాటు నూతనంగా ఎన్నికై న కౌన్సిలర్లకు డోలి వాయిద్యాలతో స్వాగతం పలికారు. పూజల అనంతరం పూజారులు కడియం శ్రీహరి, కౌన్సిలర్లను అమ్మవారి కండువా కప్పి సన్మానించి ప్రసాదం అందజేశారు.


