ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం:సీపీఐ | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం:సీపీఐ

Apr 4 2026 7:25 AM | Updated on Apr 4 2026 7:25 AM

ఆరు గ్యారంటీల అమలులో ప్రభుత్వం విఫలం:సీపీఐ

ములుగు రూరల్‌: ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ జాతీయ కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ కె.నారాయణ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఇంటింటా సర్వే నిర్వహించి విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేలో ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామన్నారు. పేదలకు ఇండ్ల స్థలాలు, గుడిసె వాసులకు పట్టాలు, రేషన్‌కార్డులు, పెన్షన్‌లు, సాగునీరుపై దృష్టిసారి స్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తోట మ ల్లికార్జున్‌, సహాయ కార్యదర్శి రవిందర్‌, అమ్జద్‌పాషా, ఇంజం కొమురయ్య, ముత్యాల రాజు, నర్సయ్య, సారయ్య, సాగర్‌, రమేష్‌, నటరాజ్‌, రాజేందర్‌, లింగమూర్తి, స్వామి, పరంసింగ్‌, గోపి, తిరుపతి, రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement