ధాన్యం కొనుగోళ్లకు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లకు

Apr 3 2026 8:02 AM | Updated on Apr 3 2026 8:02 AM

ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం

యూనిఫాం ఇండెంట్ల రద్దు

– 8లోu

న్యూస్‌రీల్‌

140 కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో 140 కేంద్రాల ఏర్పాటు

శుక్రవారం శ్రీ 3 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ములుగు రూరల్‌: యాసంగి సాగు వరిధాన్యం కొనుగోళ్లకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లాలో సాగు చేసిన వరి విస్తీర్ణానికి అనుకూలంగా దిగుబడి అంచనా వేశారు. ధాన్యం సేకరణకు కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగ సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయశాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఏప్రిల్‌ రెండో వారం నుంచి మే నెలాఖరు వరకు ధాన్యం సేకరణకు అవసరమయ్యే యంత్ర పరికరాలను అందుబాటులో ఉంచారు. నిబంధనల మేరకు ధాన్యం మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు, వ్యవసాయ అధికారులకు సూచనలు అందించారు.

60 వేల ఎకరాల్లో వరిసాగు

జిల్లాలోని పది మండలాల పరిధిలో 60,972 ఎకరాల్లో వరిసాగు చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు ఎకరాకు 22 క్వింటాల దిగుబడి అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వరి దిగుబడి సన్నరకం 68,632 మెట్రిక్‌ టన్నులు, దొడ్డు రకం 65,607 మెట్రిక్‌టన్నులఽ వరి ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా 1.08 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్దేశించారు.

25 లక్షల గన్ని బ్యాగుల అవసరం

జిల్లాలో ధాన్యం సేకరణకు 25 లక్షల గన్ని బ్యాగులు అవసరం ఉన్నాయి. దీంట్లో 12 లక్షల గన్ని బ్యాగుల అందుబాటులో ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం తూర్పార పట్టే యంత్రాలు, తేమశాతం నిర్దేశించే పరికరాలు, ఎలక్ట్రానిక్‌ కాంటాలను, టార్ఫాలిన్లు సిద్ధం చేస్తున్నారు.

ధాన్యం సేకరణకు ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. నిబంధనల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని నిర్వాహకులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. అన్ని శాఖల సమన్వయంతో ధాన్యం సేకరణ చేపడతాం. సేకరణకు సరిపడా గన్ని బ్యాగులు, యంత్ర పరికరాలు అందుబాటులో ఉంచాం. కాంటాలు అయిన వెంటనే జాప్యం లేకుండా ధాన్యం మిల్లులకు తరలిస్తాం. రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో మాత్రమే ధాన్యాన్ని విక్రయించాలి. దళారులను నమ్మి మోసపోకూడదు.

– కృష్ణవేణి, జిల్లా సివిల్‌ సప్లయీస్‌ మేనేజర్‌

విద్యార్థులకు యూనిఫాం క్లాత్‌ కోసం టెస్కోకు ఇచ్చిన ఇండెంట్‌ను ఉపసంహరించుకోవడంతో పవర్‌లూం, చేనేత సహకార సంఘాలు చతికిలపడనున్నాయి.

లక్ష్యానికి అనుగుణంగా ధాన్యం సేకరణకు జిల్లా వ్యాప్తంగా 140 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రాధమిక వ్యవసాయ కేంద్రాలు, ఐకేపీ, ఎఫ్‌పీఓల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించారు. ఆయా సంఘాలకు కేంద్రాలను కేటాయించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆధ్వర్యంలో 81, ఐకేపీ 52, ఎఫ్‌పీఓ 7 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

1.08 వేల మెట్రిక్‌ టన్నుల

ధాన్యం సేకరణ లక్ష్యం

అందుబాటులో 12 లక్షల గన్ని బ్యాగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement