వెంకటాపురం(కె): మండల పరిధిలోని పదో తరగతి పరీక్ష కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రంలో విద్యార్ధులకు ఏర్పాటు చేసిన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యాలను పరిశీలించారు. పదో తరగతి పరీక్షల్లో విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఆయన వెంట జిల్లా ఉల్లాస్ కో ఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు తదితరులు ఉన్నారు.
సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతి
ములుగు: జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవన్‌లో సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కొమురయ్య ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాపన్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షుడు ముంజాల భిక్షపతి, గౌడ సంఘం నాయకులు పులి నర్సింగం, బుర్ర శ్రీనివాస్, శ్రీకాంత్, సంక్షేమ భవన కార్యాలయ సిబ్బంది సరిత, మానస, రేణుక తదితరులు పాల్గొన్నారు.
‘విస్తారాకులతో
ఆరోగ్యానికి మేలు’
ఎస్‌ఎస్‌తాడ్వాయి: అడవుల్లో సహజంగా లభించే ఆకులతో తయారు చేసిన విస్తారాకులతో ఆరోగ్యానికి ఎంతో మేలని ప్రపంచ పర్యావరణ సంస్థ జిల్లా అధ్యక్షుడు బొల్లు నాగేంద్రకుమార్ అన్నారు. మండల పరిధిలోని కామారంలోని సమ్మక్క–సారలమ్మ ఆర్గానిక్ విస్తా రాకుల తయారు సంఘం భవనాన్ని గురువారం సందర్శించి మాట్లాడారు. పాలిథిన్ కవర్లతో ఉన్న పేపర్ ప్లేట్ల వినియోగాన్ని మానుకుని పర్యావరణానికి మేలు చేసే సహజ విస్తారాకులను వినియోగించాలని సూచించారు. విస్తారాకులు తయారు చేస్తూ ఉపాధి పొందుతున్న సంఘం సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షురాలు కొర్నెబెల్లి కవిత, సభ్యులు రేగ అనూష, కోరం ఇందు, పూర్ణ, సోలం అన్నపూర్ణ, రేగ సరళ, శ్రీదేవి పాల్గొన్నారు.
అంబేడ్కర్ జయంతి పోస్టర్ ఆవిష్కరణ
ములుగు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్‌తో కలిసి జిల్లా రైస్ మిల్లర్స్ ఆసోసియేషన్ అధ్యక్షుడు బాదం ప్రవీణ్ గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈనెల 14న ఏటూరునాగారంలో నిర్వహించే అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలకు రావాలని ఎస్పీని ఆహ్వానించారు. ఏటూరునాగారంలో అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని వా లీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చిలు వేరు అన్నమయ్య, కార్యదర్శి వేంపల్లి శంకర్, కోశాధికారి పరికి వేణుగోపాల్ పాల్గొన్నారు.
గోవిందరావుపేట: తెలంగాణ ఉద్యమకారులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యమకారుల జిల్లా అధ్యక్షుడు మురహారి భిక్షపతి అన్నారు. మండల పరిధిలోని పస్రాలో గురువారం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా భిక్షపతి హజరై మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారిని ప్రభుత్వాలు విస్మరించడం సరికాదని అన్నారు. ఉద్యమకారులు హరిప్రసాద్, సంతోష్, ఇరుగు పైడి, బత్తిని వెంకట్, యాస పూలమ్మ, మడిపెల్లి శ్యామ్, బుర్రి సతీష్, యాస కళావతి, సమ్మక్క, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.


