కూరగాయల సాగుకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

కూరగాయల సాగుకు పెద్దపీట

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

కూరగాయల సాగుకు పెద్దపీట – 8లోu సద్వినియోగం చేసుకోవాలి

న్యూస్‌రీల్‌

రైతులకు ఉచితంగా

విత్తన ప్యాకెట్ల పంపిణీ

శనివారం శ్రీ 4 శ్రీ ఏప్రిల్‌ శ్రీ 2026

ములుగు: ప్రజల అవసరాలకు అనుగుణంగా కూరగాయలు పండించే రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఎప్పుడు లేనివిధంగా వందశాతం సబ్సిడీతో విత్తనాలను అందిస్తుంది. ఒక కిట్‌లో టమాట, మిర్చి, బెండ, తోటకూర, పాలకూరకు సంబంధించిన విత్తనాలను ఉంటాయి. జిల్లాలో కూరగాయల సాగును పెంపొందించడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయాన్ని సమకూర్చాలనే నెపంతో వెజిటేబుల్‌ విత్తనాల కిట్లను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది.

625 ఎకరాల్లో సాగు అయ్యేలా..

జిల్లా వ్యాప్తంగా ప్రతీ ఏటా 150 ఎకరాల్లో మాత్రమే కూరగాయలను రైతులు పండిస్తున్నారు. ప్రజలకు సరిపడా వెజిటేబుల్‌ జిల్లాలో సాగు కాకపోవడంతో ఇతర జిల్లాల నుంచి కూరగాయలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది. దీంతో వ్యాపారులు ఇష్టారీతిగా ధరలను పెంచి అమ్ముతుండడంతో ప్రజల మీద భారం పడుతుంది. అంతేకాకుండా నాణ్యమైన కూరగాయలు దొరకని పరిస్థితి నెలకొంది. కాగా ప్రభుత్వం వందశాతం సబ్సిడీతో కిట్‌లను అందజేస్తూ కూరగాయల సాగుకు పెద్దపీట వేస్తోంది.

రైతులకు పూర్తి సబ్సిడీతో కూరగాయల విత్తనాలను అందిస్తున్నాం. ఒక కిట్‌లో ఐదు రకాల విత్తనాలు ఉంటాయి. ఒక ప్యాకెట్‌లోని విత్తనాలను అర ఎకరం వరకు సాగు చేయవచ్చు. ఆసక్తి ఉన్న రైతులు పట్టాదారు పాస్‌బుక్‌ జిరాక్స్‌, ఆధార్‌ కార్డు జిరాక్స్‌తో సమీప ఉద్యాన అధికారిని సంప్రదించి విత్తనాలు ఉచితంగా పొందవచ్చు.

– సంజీవరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి

అందుబాటులో 1,250 కిట్లు

జిల్లాలో 625 ఎకరాల్లో

కూరగాయల సాగు

పెరగనున్న సాగు విస్తీర్ణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement