గద్దెల ప్రాంగణంలో చెత్త తొలగింపు | - | Sakshi
Sakshi News home page

గద్దెల ప్రాంగణంలో చెత్త తొలగింపు

Apr 4 2026 8:07 AM | Updated on Apr 4 2026 8:07 AM

గద్దెల ప్రాంగణంలో చెత్త తొలగింపు నేడు సరస్వతీ అంత్యపుష్కరాలపై సమీక్ష

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో నిర్మించిన అండర్‌ డ్రెయినేజీలోని మురుగునీరు, చెత్త చెదారాన్ని దేవాదాయ శాఖ సిబ్బంది శుక్రవారం తొలగించారు. ఈ నెల 3న గద్దెల పునర్‌నిర్మాణ పనులు అస్తవ్యస్తం అనే కథనం సాక్షిలో కథనం ప్రచురితం కావడంతో ఈఓ వీరస్వామి స్పందించారు. ఈ మేరకు సిబ్బంది డ్రెయినేజీలోని పేరుకుపోయిన చెత్తాచెదారం, మురుగునీరును పూర్తిగా తొలగించారు. గద్దెల ప్రాంగణానికి కూడా పరిశుభ్రత చర్యలు చేపట్టారు.

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలో మే 21 నుంచి జూన్‌ 1 వరకు జరుగు సరస్వతీ నది అంత్యపుష్కరాలపై దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు శుక్రవారం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు ఈఓ మహేష్‌ తెలిపారు. ఉదయం 11.30గంటలకు వివిధ శాఖలతో చేపట్టే అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. వారి వెంట కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సంకీర్త్‌ హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement