ఎదుర్కోలు మహోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఎదుర్కోలు మహోత్సవం

Feb 15 2026 9:41 AM | Updated on Feb 15 2026 9:41 AM

ఎదుర్

ఎదుర్కోలు మహోత్సవం

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని శివాలయంలో శనివారం రాత్రి ఎదుర్కోలు మహోత్సవాన్ని నిర్వహించారు. శివ పార్వతుల కల్యాణం ముందు రోజు ఎదుర్కోలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అర్చకులు రాజ్‌కుమార్‌ ప్రత్యేక పూజలు నిర్వహించి శివుడు, పార్వతి ఇరు పక్షాల గ్రామ పెద్దలు ఎదర్కోలు నిర్వహించి తాంబూలాలను ఇచ్చి పుచ్చుకున్నారు.

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఎంపిక

ములుగు రూరల్‌: సీఎం కప్‌ రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు మండలంలోని దేవగిరిపట్నం మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీలత తెలిపారు. ఈ మేరకు శనివారం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీఎం కప్‌ జిల్లాస్థాయి క్రీడాపోటీలు ఇటీవల జాకారం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించినట్లు తెలిపారు. ఈ పోటీల్లో షాట్‌పుట్‌లో అండర్‌–16 విభాగంలో ఆకాంక్ష, రెజ్లింగ్‌ అండర్‌–14 విభాగంలో పూజిత, రెజ్లింగ్‌ అండర్‌–16 విభాగంలో రేష్మ, వాల్‌బాల్‌లో రిజ్వాన, శ్రీవేణి, కబడ్డీలో శ్రావ్య, 600 మీటర్ల పరుగు పందెంలో సన ప్రతిభ చూపి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. ఈ విద్యార్థినులు ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.

కాజీపేటలో రైల్వేట్రాక్‌

మరమ్మతు పనులు

కాజీపేట రూరల్‌: కాజీపేట జంక్షన్‌లో శనివారం రైల్వే ఇంజనీరింగ్‌ అధికారులు రైల్వేట్రాక్‌ మరమ్మతు పనులు చేపట్టారు. కాజీపేట రైల్వే స్టేషన్‌లోని ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాంలో రైల్వేట్రాక్‌ కాలపరిమితి పూర్తి అయ్యింది. ఆ స్థానంలో కొత్త రైల్వేట్రాక్‌ (ట్రాక్‌ రెల్‌ రిప్లస్‌) పనులు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. గతంలో ఒక రైలు పట్టా 13 మీటర్ల వరకు ఉండేదని, ప్రస్తుతం ఎలాంటి జాయింట్‌ లేకుండా 200 మీటర్ల వరకు రైలు పట్టా ఉంటుందని పేర్కొన్నారు. అధునాతన సాంకేతిక రైళ్ల వేగాన్ని తట్టుకునేందుకు ఈ ట్రాక్‌ వేస్తున్నట్లు తెలిపారు. వారం రోజుల నుంచి ఇంజనీరింగ్‌ స్టాఫ్‌, యంత్రాలతో ట్రాక్‌ రెన్యువల్‌ పనులు చేపడుతున్నట్లు అధికారులు వివరించారు.

కంప్యూటర్‌ సైన్స్‌ బీఓఎస్‌గా రమేశ్‌

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీలోని కంప్యూటర్‌ సైన్స్‌ విభాగం బోర్డు ఆఫ్‌ స్టడీస్‌ చైర్మన్‌గా (బీఓఎస్‌) అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.రమేశ్‌ను నియమిస్తూ రిజిస్ట్రార్‌ ఆచార్య వి.రామచంద్రం శనివారం ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటివరకు బీఓఎస్‌గా పనిచేసిన డాక్టర్‌ మంజుల పదవికాలం ముగియడంతో రమేశ్‌ను నియమించారు. బాధ్యతలు స్వీకరించిన ఆయన ఈ పదవిలో రెండు సంవత్సరాలపాటు కొనసాగనున్నారు.

ఎదుర్కోలు మహోత్సవం
1
1/1

ఎదుర్కోలు మహోత్సవం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement