ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఇసుక లారీ
● ఆరుగురికి గాయాలు
ఏటూరునాగారం: ఓ ట్రాక్టర్‌ను ఇసుక లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ట్రాక్టర్ బోల్తాపడగా ఆరుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదం మండల పరిధిలోని రొయ్యూర్ సమీపంలో గల 163వ జాతీయ రహదారిపై శనివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..మిర్చి లోడుతో వెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి వచ్చిన ఇసుక లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్రాలీలోని నలుగురు, ఇంజిన్‌పై కూర్చున్న ఇద్దరు ఎగిరిపడ్డారు. ఏటూరునాగారానికి చెందిన కూలీలు ట్రాక్టర్ యజమాని పూజారి బుచ్చయ్యతో కలిసి మిర్చి తోట నుంచి ఏటూరునాగారం వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన ఆరుగురిని 108లో సామాజిక ఆస్పత్రికి తరలింలించారు. క్షతగాత్రులు గాయాలతో బయపడినట్లు వైద్యులు తెలిపారు. ఢీ కొట్టిన లారీ వివరాలపై స్థానికులు ఆరా తీస్తున్నారు.


