పూజా కార్యక్రమాల వివరాలు..
నేటి(ఆదివారం) ఉదయం 4:30 గంటలకు సుప్రభాతం, 6 నుంచి గణపతి పూజ, అఖండ దీపారాధన, పుణ్యహవచనము, అంకురార్పణ, రక్షబంధనం, సామూహిక రుద్రాభిషేకాలు నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటలకు శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని ఆలయ పూజారులు కోమల్లపల్లి హరీశ్ శర్మ, ఉమాశంకర్‌లు వైభవంగా జరిపించనున్నారు. 16న సోమవారం 5 గంటలకు సుప్రభాతం, గణపతి పూజ, స్వామివారికి రుద్రాభిషేకాలు, 11 నుంచి గణపతి పూజ, విగ్రహారాధన, వీరభద్ర పళ్లెరము, సాయంత్రం భద్రకాళి పూజ, సహస్రనామార్చన, బలిహరణ, దీపోత్సవం నిర్వహించనున్నారు. 17న మంగళవారం అగ్నిగుండాల మహోత్సవంతో పాటు తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
మహాశివరాత్రికి ఏర్పాట్లు పూర్తి
మహాశివరాత్రికి రామప్ప ఆలయానికి వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాత్రి 10గంటలు శివపార్వతుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తాం. రామలింగేశ్వరస్వామిని భక్తులు సులభంగా దర్శించుకునేలా క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేశాం. జాగరణ భక్తులకు అరటిపండ్లు, కందగడ్డ, అంగూర పండ్లను అదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రసాదంగా అందించనున్నాం. భక్తులకు తాగునీటి వసతి కల్పించాం. – బిల్ల శ్రీనివాస్, ఈఓ రామప్ప
పూజా కార్యక్రమాల వివరాలు..


