మేడారం టు రామప్ప | - | Sakshi
Sakshi News home page

మేడారం టు రామప్ప

Feb 1 2026 3:39 AM | Updated on Feb 1 2026 3:39 AM

మేడార

మేడారం టు రామప్ప

వెంకటాపురం(ఎం): మేడారం వనదేవతల ను దర్శించుకుని రామప్ప ఆలయానికి వచ్చే భక్తులతో శనివారం సందడి నెలకొంది. భారీ సంఖ్యలో తరలిరావడంతో పోలీసులు, దేవాదాయశాఖ సిబ్బంది క్యూలైన్లలో భక్తులను పంపించారు. రామప్ప రామలింగేశ్వరస్వామిని భక్తులు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. అదేవిధంగా రామప్ప ఆలయాన్ని అగ్నిమాపక డీజీ విక్రమ్‌సింగ్‌ మాన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్‌లు వేర్వేరుగా రామప్పను సందర్శించి రామలింగేశ్వరస్వామికి పూజలు నిర్వహించారు. హైకోర్టు జడ్జిలు సృజన, రాణి రామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయ విశిష్టత గురించి గైడ్‌ విజయ్‌కుమార్‌ వారికి వివరించారు.

మేడారం టు రామప్ప
1
1/1

మేడారం టు రామప్ప

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement