నామినేషన్ల పరిశీలన
ములుగు: మున్సిపాలిటీ ఎన్నికల కోసం మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించిన అధికారులు శనివారం పరిశీలించారు. 20 వార్డులకు 192 నామినేషన్లు దాఖలు కాగా ఏ ఒక్కటి తిరస్కరణకు గురి కాలేదని మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్ తెలిపారు. 1వ వార్డుకు 7 నామినేషన్లు దాఖలు కాగా 2వ వార్డుకు 9, 3వ వార్డుకు 9, 4వ వార్డుకు 7, 5వ వార్డుకు 6, 6వ వార్డుకు 7, 7వ వార్డుకు 12, 8వ వార్డుకు 7, 9వ వార్డుకు 17, 10వ వార్డుకు 8, 11వ వార్డుకు 13, 12వ వార్డుకు 7, 13వ వార్డుకు 16, 14వ వార్డుకు 7, 15వ వార్డుకు 11, 16వ వార్డుకు 11, 17వ వార్డుకు 7, 18వ వార్డుకు 5, 19వ వార్డుకు 11, 20వ వార్డుకు 15 నామినేషన్లు దాఖలు అయినట్లు ఆయన వెల్లడించారు.
20 వార్డులకు.. 192 నామినేషన్లు
నామినేషన్ల పరిశీలన


