మహాజాతరను విజయవంతం చేయాలి
ములుగు: మేడారం మహాజాతరను అధికారులు సమన్వయంతో పనిచేస్తూ జాతరను విజయవంతం చేయాలని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి మేడా రం మహాజాతర 21 లైన్ శాఖల జోనల్, నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సమ్మక్క–సారలమ్మ జాతరకు, గద్దెల పునరుద్ధరణకు ప్రభుత్వం రూ.251 కోట్ల నిధులతో శాశ్వత అభివృద్ధి పనులు చేస్తుందని తెలిపారు. గత జాతరలో వచ్చిన భక్తుల సంఖ్యతో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వనదేవతల దర్శనం జరిగే విధంగా సౌకర్యాలు కల్పించాలన్నారు. రేపటి నుంచి నోడల్ అధికారులు మేడారంలో జోన్, సెక్టార్‌లలో ఫీల్డ్ విజిట్ నివేదికలు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్, నోడల్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర


