నార్లాపూర్ పోలీస్‌స్టేషన్ ప్రారంభం
ఎస్‌ఎస్ తాడ్వాయి: మండల పరిధిలోని మేడారంలో నూతనంగా నిర్మించిన నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌ను మంత్రి సీతక్క బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ స్టేషన్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్టేషన్ ఏర్పాటుతో మేడారం వచ్చే భక్తులకు, స్థానికులకు శాంతి భద్రతల పరిరక్షణకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. నార్లాపూర్ పోలీస్‌స్టేషన్ హౌస్ అధికారిగా ఎస్సై కమలాకర్, 30 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్ సిబ్బంది పస్రా సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దయాకర్ పర్యవేక్షణలో బాధ్యతలు నిర్వహిస్తారని వివరించారు. కార్యక్రమంలో కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, ఓఎస్డీ శివం ఉపాధ్యాయ, ఏఎస్పీ మనన్ బట్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


