లయన్స్‌క్లబ్‌కు గ్లోబల్ సర్వీస్ ఆక్టివిటీ అవార్డు
ములుగు: హనుమకొండలోని శాయంపేట లయన్స్ క్లబ్ భవనంలో లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవార్డు నైట్ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్‌కు గ్లోబల్ సర్వీస్ ఆక్టివిటీ అవార్డు లభించింది. 2024–25లో చేసిన సేవలను గుర్తించి గ్లోబల్ సర్వీసెస్ సర్వీస్ అవార్డు అందజేసినట్లు తెలిపారు. అలాగే బెస్ట్ సెక్రటరీగా చుంచు రమేశ్, బెస్ట్ కోశాధికారిగా సానికొమ్ము రవీందర్‌రెడ్డికి, కుందూరు వెంకట్ రెడ్డిని డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా గుర్తించి శాలువాలతో ప్రస్తుత గవర్నర్ చంద్రశేఖర ఆర్య సత్కరించారు. ఈ కార్యక్రమంలో ములుగు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మెరుగు రమేశ్, జిల్లా చైర్మన్ కొండి సాంబశివ పాల్గొన్నారు.


