పెండింగ్ డీఏలు వెంటనే ఇవ్వాలి
ఏటూరునాగారం : రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐదు డీఏలు, హెల్త్ కార్డులను వెంటనే ఇవ్వాలని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు సారయ్య, మండల అధ్యక్షుడు పొదెం కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలో జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెండేళ్ల పీఆర్‌సీని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం ఏటూరునాగారం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా ఎన్నికై న కాకులమర్రి శ్రీలత లక్ష్మీనర్సింహారావు దంపతులను విశ్రాంత ఉద్యోగులు సన్మానించారు.


