పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
ఏటూరునాగారం: పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్ అన్నారు. మండల పరిధిలోని ఏటూరునాగారం, పస్రా, ఎస్‌ఎస్ తాడ్వాయి రేంజ్ పరిధిలో అడవిలో ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను అటవీశాఖ తొలగించే కార్యక్రమాన్ని గురువారం చేపట్టింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీశాఖ సిబ్బంది టీంలుగా ఏర్పడి ప్లాస్టిక్, ఇతర వస్తువులను ఏరి పారేసినట్లు తెలిపారు. రోడ్ల వెంట పర్యాటకులు చెత్తాచెదారం వేసి పర్యావరణాన్ని దెబ్బతినేలా చేస్తున్నారని వివరించారు. అడవిలో ప్లాస్టిక్, మద్యం సీసాలను వేయడం వల్ల జంతువులు ప్లాస్టిక్‌ను తిని మరణించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. సీసపెంకులతో వన్యప్రాణులకు ముప్పు ఉందన్నారు. అడవిలో మద్యం, నిప్పు వంటి వస్తువులను వినియోగించిన వారిపై కేసులు నమోదు చేశామన్నారు. 1500 కిలోల ప్లాస్టిక్‌ను ఒక రోజులో సేకరించామన్నారు.
ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్ రెహమాన్


