కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి
ములుగు రూరల్: పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని కోరారు. చలో గావ్ అభియాన్ చలో బస్తీ అభియాన్ కార్యక్రమం ద్వారా ప్రతీ క్రియాశీల సభ్యుడు గ్రామాలను ఎంపిక చేసుకొని పర్యటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రవీంద్రాచారి, రవీందర్‌రెడ్డి, కృష్ణాకర్, రవిరెడ్డి, వెంకన్న, మహేందర్, విజేందర్, గట్టయ్య, సిద్దు తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం


