జాతరను విజయవంతం చేయాలి
కాళేశ్వరం: ములుగు జిల్లాలోని రామంజపురంలో త్వరలో నిర్వహించనున్న నాంచారమ్మ జాతరను విజయవంతం చేయాలని ఆదివాసీ ఎరుకల సంఘం భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కేతిరి సుభాష్, ఉపాధ్యక్షుడు దుగ్యాల రాములు అన్నారు. మహదేవపూర్ మండలంలో ఎరుకల ముఖ్య నాయకుల సమావేశం ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జాతరకు ఎరుకలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఎరుకల నాయకులు సుల్తాన్ సుధాకర్, సుల్తాన్ సారయ్య, శ్రీరామ రమేష్, సుల్తాన్ లడ్డు, దుద్యాల పోషం, సుల్తాన్ తిరుపతి, సుల్తాన్ పున్నం, సుల్తాన్ ప్రభాకర్, కేతుర్ రాకేష్‌లు పాల్గొన్నారు.


