ఖురాన్ నేర్చుకున్న ధురంధర్‌ దర్శకుడి సతీమణి | Yami Gautam Learn Quran For Her Role In Haq Movie | Sakshi
Sakshi News home page

ఖురాన్ నేర్చుకున్న ధురంధర్‌ దర్శకుడి సతీమణి

Apr 24 2026 8:45 AM | Updated on Apr 24 2026 8:57 AM

Yami Gautam Learn Quran For Her Role In Haq Movie

యామీ గౌతమ్‌ 'హక్‌' కోసం ఖురాన్‌ నేర్చుకున్నారు: దర్శకుడు  సుపర్న్ ఎస్ వర్మ
 

బాలీవుడ్‌ నటి యామీ గౌతమ్‌, ఇమ్రాన్‌ హష్మీ జంటగా నటించిన చిత్రం హక్‌.. గతేడాది విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు  సుపర్న్ ఎస్ వర్మ ఈ మూవీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సినిమా మేకింగ్‌లో భాగంగా వాస్తవికతను తెలుసుకునేందుకు  తమ టీమ్‌ ఎంతగానో శ్రమించిందని ఆయన వెల్లడించారు.

హక్‌ సినిమా ఇస్లాం మత విధానం, వారి ఆచారాలు వంటి అంశాలతో నిండి ఉంటుంది. దీంతో ఇస్లామిక్‌ చట్టాన్ని అర్థం చేసుకోవడానికి తమకు సుమారు ఏడాదిన్నర సమయం పట్టిందని దర్శకుడుసుపర్న్ ఎస్ వర్మ తెలిపారు. షా బానో పాత్రలో యామీ గౌతమ్‌ జీవించారిన ఆయన అన్నారు. యామీ గౌతమ్ తన పాత్రను మరింత  లోతుగా అర్థం చేసుకోవడానికి  మత గ్రంథాలను అధ్యయనం చేయడంతో సహా విస్తృతమైన సన్నాహాలు చేశారని సుపర్న్ వర్మ వెల్లడించారు. ఈ పాత్ర కోసం  పవిత్ర ఖురాన్‌ను కూడా యామీ నేర్చుకున్నారని ఆయన తెలిపారు. ఈ మూవీతో యామీ గౌతమ్‌కు మంచి గుర్తింపు దక్కింది. ధురంధర్‌ దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఆమె సతీమణి అనే విషయం తెలిసిందే.

45 ఏళ్ల క్రితం జరిగిన షా బానో కేసును తిరిగి ఈ మూవీతో మరోసారి గుర్తుచేశారు.  మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన షా బానో(62)కు, తన భర్త మహమ్మద్ అహ్మద్ ఖాన్ త్రిబుల్ తలాక్ ద్వారా విడాకులిచ్చాడు. జస్ట్ త్రిబుల్ తలాక్ అనే పదంతో తమ 40 ఏళ్ల బంధం తెగిపోయింది. అయితే, పిల్లల పోషణ బాధ్యతను పట్టించుకోకుండా భార్యను వదిలేయడంతో  ఆమె 125 సీఆర్పీసీ కింద కోర్టులో పిటిషన్ వేసింది. సుమారు పదేళ్ల తర్వాత సుప్రీంలో షా బానో కేసు గెలిచింది. దీంతో భారతీయ ముస్లిం మహిళల హక్కులను కాపాడిన కేసుగా షా బానో  తీర్పుకు ప్రాధాన్యత దక్కింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement