నేరుగా ఓటీటీలోకి ‘విట్‌నెస్‌’ | Sakshi
Sakshi News home page

నేరుగా ఓటీటీలోకి ‘విట్‌నెస్‌’

Published Sat, Dec 3 2022 9:23 AM

Witness Movie Direct Release OTT Sony Liv - Sakshi

శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అళగం పెరుమాళ్, జి. సెల్వ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం ‘విట్‌నెస్‌’. ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరించడంతో పాటు సినిమాటోగ్రాఫర్‌గాను చేశారు దీపక్‌. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమా నేరుగా సోనీ లివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది. ‘‘పారిశుద్ధ్య కార్మికుల జీవితాల ఆధారంగా రూపొందిన చిత్రం ఇది. పార్తీపన్‌ అనే 20 ఏళ్ల కుర్రాడు ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌ సెప్టిక్‌ ట్యాంక్‌ను శుభ్రం చేస్తూ మరణిస్తాడు. అప్పుడు అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం ఎలా పోరాడింది? అనే నేపథ్యంలో మూవీ ఉంటుంది’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement