గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాప్‌ హీరోయిన్‌.. ట్రోల్స్‌తో నెటిజన్లు | Guess The Actress: Telugu Heroine Spotted In Mumbai Airport - Sakshi
Sakshi News home page

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాప్‌ హీరోయిన్‌.. ట్రోల్స్‌తో నెటిజన్లు

Published Mon, Feb 19 2024 1:32 PM

Who Guess The Telugu Heroine In Mumbai Airport - Sakshi

ఆయేషా టకియా అంటే గుర్తుపడతారో లేదో కానీ నాగార్జున సినిమా 'సూపర్‌' హీరోయిన్‌ అంటే మాత్రం ఇట్టే కనిపెడతారు. 'సూపర్‌'తో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అప్పటికే బాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేసింది. 'టార్జాన్‌: ద వండర్‌ కార్‌' సినిమాతో ఫిలింఫేర్‌ బెస్ట్‌ డెబ్యూ అవార్డు పట్టేసింది. ఆ తర్వాత 'సోచా న తా', 'సలామ్‌ ఇ ఇష్క్‌', 'వాంటెడ్‌', 'పాఠశాల' వంటి పలు హిట్‌ చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ సరైన కథలు ఎంపిక చేసుకోవడంలో తడబడ్డ ఆయేషా వెండితెరపై కనిపించలేదు. అగ్రకథానాయికగా వెలుగులీనిన ఆమె పెళ్లితో ఇండస్ట్రీకి దూరమైంది. 

చాలా ఏళ్ల తర్వాత తాజాగా ఆమె ముంబై ఎయిర్‌పోర్ట్‌లో తన కుమారుడితో కనిపించింది. ఆ సమయంలో వెంటనే ఎవరూ ఆమెను కనీసం గుర్తు కూడా పట్టలేకపోయారు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్‌ అయింది. దీంతో చాలామంది ట్రోలర్స్‌ ఆమెపై నెగటీవ్‌ కామెంట్లు చేయడం ప్రారంభించారు. ఆమె రూపం గూరించి చాలా క్రూరంగా ట్రోల్‌ చేశారు. దీంతో ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రియాక్ట్‌ అయ్యారు.

' నా రూపం గురించి మాట్లడటం మినహ దేశంలో ఇతర ఎలాంటి ముఖ్యమైన సమస్యలు లేవని తేలింది. ఒకరి గురించి ఎలా అలాంటి కామెంట్లు చేస్తారు.. నా మీద కామెంట్లతో దాడి చేస్తున్నారా..? అందరూ అనుకుంటున్నట్లు నేను ఇప్పుడు హీరోయిన్‌ను కాదు. మళ్లీ సినిమాల్లో నటించాలనే ఆలోచన లేదు. నేను నా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను. మళ్లీ లైమ్‌లైట్‌లోకి రావాలని కోరిక నాకు లేదు. ఏ సినిమాలోనూ నేను ఉండాలని కోరుకోవడం లేదు.' అని తెలిపింది.

ఫ్యాట్ షేమింగ్ గురించి, అయేషా ప్రతి ఒక్కరిపై లాజిక్‌తో విరుచుకుపడింది, 'టీనేజ్‌లో ఉన్న అమ్మాయి బాగా అందంగానే కనిపిస్తుంది. అదే అమ్మాయి 15 ఏళ్ల తర్వాత కూడా ఒకేలా కనిపించాలని ఆశించడం హాస్యాస్పదమైన విషయం. మీతో పాటు సంతోషంగా జీవించే అమ్మాయిని కోరుకోండి.. దయచేసి అందంగా ఉన్న అమ్మాయిల్ని వేరు చేయకండి.

జీవితంలో ఏదైనా మంచిపని చేయండి, అభిరుచిని పొందండి, సరదాగా భోజనం చేయండి, మీ స్నేహితుడితో మాట్లాడండి, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండండి, మీరు కోరుకున్నట్లుగా ఎదుటివారు కనిపించడంలేదని ఆందోళన వద్దు.' అని హితభోదన చేసింది. ఈ నోట్‌ తర్వాత ట్రోలర్స్‌ నుంచి ఎలాంటి కామెంట్లు రాలేదు. ఏదేమైనా ఆమె మళ్లీ సినిమాల్లోకి రావడం ఇష్టం లేదని చెప్పడంతో ఫ్యాన్స్‌ కొంతమేరకు నిరాశ చెందారు.

Advertisement
 
Advertisement
 
Advertisement