టీనేజీలోకి అడుగుపెట్టిన 'భజరంగీ భాయ్‌జాన్‌' చిన్నారి

WATCH: Munni From Bajrangi Bhaijaan Aka Harshali Malhotra Is Officially A Teenager Now - Sakshi

2015లో వచ్చిన 'భజరంగీ భాయ్‌జాన్‌' సినిమాలో మున్నీ గుర్తుందా? సల్మాన్‌ ఖాన్‌ ఆమెను భుజాల మీద వేసుకుని ఆడిపించుకునేవాడు. ఎంతో క్యూట్‌గా, అమాయకంగా కనిపించే ఆ చిన్నారి ఇప్పుడు టీనేజర్‌. ఇంతకీ మున్నీ అసలు పేరు హర్షలి మల్హోత్రా.

తాజాగా ఆమె 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా కేక్‌ కట్‌ చేస్తున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 'ఇట్స్‌ మై బర్త్‌డే.. ఇప్పుడు నేను టీనేజర్‌ను' అంటూ వీడియోలను సైతం అభిమానులతో పంచుకుంది. తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పింది.

బర్త్‌డే ఫొటోల్లో హర్షలిని చూసిన నెటిజన్లు ఆమె చాలా ఎదిగిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కాకపోతే చిన్నప్పుడు ఎంత క్యూట్‌గా ఉందో, ఇప్పుడు కూడా అంతే క్యూట్‌గా ఉందంటున్నారు. కాగా హర్షలికి ఇన్‌స్టాగ్రామ్‌లో 10 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆమె తరచూ రీల్స్‌ చేయడంతోపాటు ఎప్పటికప్పుడు ఫొటోలను సైతం షేర్‌ చేస్తుంది.

చదవండి: బైపోలార్ డిజార్డర్ ఉంది కానీ సైకోని కాదు : నటి

చిరు పరిచయం, మోహన్‌బాబు డైలాగులతో రచ్చ!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top