
విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నా.. వీళ్లిద్దరి జోడీని అభిమానులు ఎంతగానో ఇష్టపడతారు. అటు ఈ హీరోహీరోయిన్స్ కూడా ఆన్‌స్క్రీన్‌పైనే కాకుండా ఆఫ్ స్క్రీన్‌లోనూ డ్యూయెట్ పాడుకుంటున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఇది వుట్టి ప్రచారం మాత్రమే కాదని ఇది నిజమే అన్నట్లుగా పరోక్షంగా హింట్స్ ఇస్తున్నారిద్దరూ. తరచూ వీరు వెకేషన్‌కు వెళ్లడం, లేదంటే రౌడీ హీరో ఇంట్లో పాగా వేయడం.. అక్కడ వేర్వేరుగా దిగిన ఫోటోలు షేర్ చేయడం... ఇద్దరి ఫోటోల బ్యాగ్రౌండ్ ఒకేలా ఉండటంతో వాళ్లు కలిసే ఉన్నారని జనాలు పసిగట్టడం జరుగుతూ వస్తోంది. తాజాగా మళ్లీ ఇదే రిపీటైంది.
విజయ్ ఇంట్లో రష్మిక
నవంబర్ 12న దీపావళి సందర్భంగా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో ఫ్యామిలీ ఫోటో షేర్ చేశాడు. అలాగే పటాసులు కాల్చి పారిపోతున్న పిక్ కూడా జత చేశాడు. అటు నేషనల్ క్రష్ రష్మిక సైతం 'దివాళీ శుభాకాంక్షలు..' అంటూ చీరకట్టులో ముస్తాబైన ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంది. అందులో ఓ సోఫాలో కూర్చుంది. వీళ్లిద్దరి ఫోటోల్లో వెనకాల ఉన్న గోడ డిజైన్ ఒకేలా ఉండటంతో మళ్లీ దొరికిపోయారు అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రష్మిక కాబోయే అత్తారింట్లో పండగ జరుపుకుందని అభిప్రాయపడుతున్నారు.
సినిమాల సంగతేంటంటే?
కాగా వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేట్ సినిమాల్లో కలిసి నటించారు. ప్రస్తుతం విజయ్ తన 12వ చిత్రంతో పాటు ఫ్యామిలీ స్టార్ అనే మూవీ చేస్తున్నాడు. అటు రష్మిక.. బాలీవుడ్ సినిమా యానిమల్‌లో నటిస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 1న విడుదల కానుంది. అలాగే రెయిన్‌బో, పుష్ప: ద రూల్ సినిమాలు కూడా ఆమె చేతిలో ఉన్నాయి.
చదవండి: స్టార్ హీరోకు కలిసొచ్చిన దీపావళి.. తొలిరోజే భారీ వసూళ్లు.. థియేటర్‌లో ఫ్యాన్స్ రచ్చ
Comments
Please login to add a commentAdd a comment