శ్రీకాంత్ చేతుల మీదుగా 'వెంకటలక్ష‍్మితో' ఫస్ట్ లుక్ పోస్టర్ | Venkata Lakshmitho Movie First Look | Sakshi
Sakshi News home page

శ్రీకాంత్ చేతుల మీదుగా 'వెంకటలక్ష‍్మితో' ఫస్ట్ లుక్ పోస్టర్

Aug 31 2024 8:04 PM | Updated on Aug 31 2024 8:04 PM

Venkata Lakshmitho Movie First Look

టింట్ స్ప్రీ స్టూడియోస్ బ్యానర్‌‌పై ఆలేటి రాజేష్ నిర్మించిన సినిమా 'వెంకటలక్ష‍్మితో'. రామమూర్తి  కొట్టాల దర్శకుడు. రఘు గద్వాల్, ప్రియాంక శ్రీ, శివ ప్రసన్న హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్‌‌ని హీరో శ్రీకాంత్ శనివారం లాంచ్ చేశారు. సినిమా విజయం సాధించాలని కోరారు.

షార్ట్ ఫిలింస్‌తో ఫేమస్ అయిన రఘు.. ఈ  సినిమాతో అందరినీ ఆకట్టుకుంటాడని నమ్ముతున్నా. కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. ఇది కూడా ఓ కొత్త కంటెంట్‌తో రాబోతోందని అర్ధమవుతోందని శ్రీకాంత్ అన్నాడు. హీరో శ్రీకాంత్ మాకు సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. మా టీమ్ తరపున శ్రీకాంత్‌కి స్పెషల్ థాంక్స్ అని హీరో రఘు చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement