మెగా హీరోతో గరుడవేగ డైరెక్టర్‌ తర్వాతి సినిమా?

Varun Tej Next Project With Garuda Vega Director? - Sakshi

వరుణ్‌తేజ్‌ పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నడు. ప్రస్తుతం కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వంలో దర్శకత్వంలో గని మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాక్సర్‌గా సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీ షూటింగ్‌ గ్యాప్‌లోనే అనిల్‌ రావిపూడి డైరెక‌్షన్‌లో ఎఫ్‌3 సినిమా చేస్తున్నాడు. పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరెకెక్కుతున్న ఈ మూవీతో మరోసారి బాక్సీఫీస్‌ హిట్‌ కొట్టేందుకు రెడీ అయ్యాడు. కరోనా కారణంగా షూటింగ్‌ వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఈ గ్యాప్‌లో వరుణ్‌ మరో మూవీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. ‘గరుడవేగా’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న ప్రవీణ్‌ సత్తార్‌ దర్శకత్వంలో వరుణ్‌ నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు చెప్పిన స్టోరీ లైన్‌ నచ్చి వరుణ్‌ వెంటనే ఆ ప్రాజెక్టును ఓకే చేసినట్లు ఇండస్ర్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. సినిమా కథ ప్రకారం చిత్ర షూటింగ్‌ మొత్తం లండన్‌లోనే జరగనున్నట్లు సమాచారం. దీంతో పరిస్థితులు కొంచెం సద్దుమణిగాక ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు నాగార్జునతో ఓ సినిమా చేస్తున్నారు. ఇది పూర్తయిన వెంటనే వరుణ్‌తో ప్రాజెక్టు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 

చదవండి : దూకుడు పెంచిన నాగ చైతన్య.. ఆ హిట్‌ డైరెక్టర్‌తో నెక్స్ట్‌ సినిమా
మరోసారి జంటగా నటించనున్న వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి ?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top