Varun Dhawan And Janhvi Kapoor Bawaal Trailer Launch At Dubai - Sakshi
Sakshi News home page

ప్యారిస్‌లో హనీమూన్..

Published Mon, Jul 10 2023 3:52 AM

Varun Dhawan and Janhvi Kapoor Bawaal trailer launch at Dubai - Sakshi

వరుణ్‌ ధావన్ , జాన్వీ కపూర్‌ జంటగా నటించిన హిందీ చిత్రం ‘బవాల్‌’. ‘దంగల్‌’ ఫేమ్‌ నితేష్‌ తివారి దర్శకత్వంలో సాజిద్‌ నడియాద్‌వాలా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21 నుంచి అమేజాన్  ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుక దుబాయ్‌లో జరిగింది. ఈ చిత్రంలో హిస్టరీ టీచర్‌ అజయ్‌గా వరుణ్‌  ధావన్ , నిషాగా జాన్వీ నటించారు.

అజయ్, నిషాలు వివాహం చేసుకుని హనీమూన్  కోసం ప్యారిస్‌కు వెళతారు. అక్కడ వీరి మధ్య ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి? అనే కథాంశం నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఈ సినిమా మేజర్‌ షూటింగ్‌ కూడా ప్యారిస్‌లోనే జరిగింది. అయితే ఈ మూవీలో రెండో ప్రపంచ యుద్ధానికి, వరుణ్‌–జాన్వీల ప్రేమకథకు ఉన్న సంబంధం ఏంటి? అనేది ఆసక్తికరంగా ఉంటుంది’’ చిత్ర యూనిట్‌ పేర్కొంది. ‘ప్రతి ప్రేమ కథకు, ఆ ప్రేమ తాలూకు యుద్ధం ఉంటుంది’ అన్న విజువల్స్‌ ట్రైలర్‌లో కనిపిస్తాయి. 

Advertisement
 
Advertisement
 
Advertisement