వైజాగ్‌లో షూటింగ్‌ కంప్లీట్‌ చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Varalakshmi Sarathkumar Sabari Shooting In Vizag Completed - Sakshi

వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం ‘శబరి’. అనిల్‌ కాట్జ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మహర్షి కూండ్ల సమర్పణలో మహేంద్ర నాథ్‌ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా తాజా షెడ్యూల్‌ వైజాగ్‌లో పూర్తయింది. ఈ సంద్భంగా అనిల్‌ కాట్జ్‌ మాట్లాడుతూ– ‘‘శబరి’ భిన్నమైన చిత్రం. స్వతంత్ర భావాలున్న యువతి పాత్రలో వరలక్ష్మి కనిపిస్తారు. మూడో షెడ్యూల్‌లో భాగంగా వైజాగ్‌లోని ఆర్కే బీచ్, సిరిపురం జంక్షన్‌తో పాటు అరకు లాంటి అందమైన లొకేషన్లలో షూటింగ్‌ చేశాం.

ప్రధాన తారాగణంపై కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌లు, ఒక పాట, కీ సీన్స్‌ చిత్రీకరించాం. నందు, నూర్‌ మాస్టర్స్‌ పర్యవేక్షణలో రూపొందిన యాక్షన్‌ సీన్స్‌ హైలెట్‌గా నిలుస్తాయి. ఈ నెలలో హైదరాబాద్‌లో నాలుగో షెడ్యూల్‌ మొదలు కానుంది’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాహుల్‌ శ్రీవాత్సవ, నాని చమిడి శెట్టి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సీతారామరాజు మల్లెల.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top