మహాశివరాత్రి: టాలీవుడ్‌ కొత్త అప్‌డేట్స్‌ ఇవే! | Tollywood updates on the occasion of Maha Shivratri | Sakshi
Sakshi News home page

మహాశివరాత్రి: టాలీవుడ్‌ కొత్త అప్‌డేట్స్‌ ఇవే!

Feb 19 2023 2:19 AM | Updated on Feb 19 2023 8:47 AM

Tollywood updates on the occasion of Maha Shivratri - Sakshi

మహా శివరాత్రి సందర్భంగా టాలీవుడ్‌ జోరుగా హుషారుగా మహా అప్‌డేట్స్‌ ఇచ్చింది. ఆ విశేషాలు తెలుసుకుందాం...

వెండితెర బోళా  శంకరుడిగా దుష్టులపై శివతాండవం చేస్తున్నారు చిరంజీవి. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో చిరంజీవి టైటిల్‌ రోల్‌ చేస్తున్న చిత్రం ‘బోళా శంకర్‌’. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా, ఆయనకు చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్‌ నటిస్తున్నారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బోళా శంకర్‌’లోని చిరంజీవి కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతదర్శకుడు. ఏప్రిల్‌ 14న ‘బోళా శంకర్‌’ని విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు పండగ రోజున ‘నేను ప్యార్‌లోన పాగలే..’ అంటూ ‘రావణాసుర’ చిత్రం కోసం పాట పాడారు రవితేజ. పబ్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ లిరిక్స్‌ అందించగా, స్వయంగా రవితేజ పాడటం విశేషం.

సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్‌ రామేశ్వర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా, హీరో సుశాంత్‌ కీ రోల్‌ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 7న విడుదల కానుంది. ఇక సంక్రాంతికి థియేటర్స్‌లోకి వస్తానన్న విషయాన్ని శివరాత్రి రోజున వెల్లడించారు ప్రభాస్‌. నాగ్‌ అశ్విన్  దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా ప్రాజెక్ట్‌ కె’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలి సిందే.

దీపికా పదుకోన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్‌ బచ్చన్, దిశా పటానీ కీ రోల్స్‌ చేస్తున్నారు. అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. అలాగే శివరాత్రి రోజునే ‘రామబాణం’ ఫస్ట్‌ లుక్‌ను వదిలారు గోపీచంద్‌. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత మూడోసారి హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘రామబాణం’. 

ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్‌ కూచిభొట్ల  నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్‌ హయతి హీరోయిన్‌గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బూ కీ రోల్స్‌ చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్‌ కానుంది. ఇక త్వరలోనే మ్యూజిక్‌ బ్లాస్ట్‌ ఉంటుందంటున్నారు ‘ఏజెంట్‌’. అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్‌’. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రముఖ హీరో మమ్ముట్టి ఓ కీ రోల్‌ చేస్తున్నారు.

కాగా ‘ఏజెంట్‌’ ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు మేకర్స్‌. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, సురేందర్‌ 2 సినిమాస్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘ఏజెంట్‌’ చిత్రం ఏప్రిల్‌ 28న రిలీజ్‌ కానుంది.  ఇవే కాదు.. అల్లరి నరేశ్‌ ‘ఉగ్రం’, సాయిధరమ్‌ ‘విరూపాక్ష’, సందీప్‌ కిషన్‌ ‘ఊరు పేరు భైరవకోన’తో పాటు మరికొన్ని చిత్రబృందాలు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement