breaking news
Chiranjeevi Chaudhary
-
మహాశివరాత్రి: టాలీవుడ్ కొత్త అప్డేట్స్ ఇవే!
మహా శివరాత్రి సందర్భంగా టాలీవుడ్ జోరుగా హుషారుగా మహా అప్డేట్స్ ఇచ్చింది. ఆ విశేషాలు తెలుసుకుందాం... వెండితెర బోళా శంకరుడిగా దుష్టులపై శివతాండవం చేస్తున్నారు చిరంజీవి. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి టైటిల్ రోల్ చేస్తున్న చిత్రం ‘బోళా శంకర్’. ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా తమన్నా, ఆయనకు చెల్లెలి పాత్రలో కీర్తీ సురేష్ నటిస్తున్నారు. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాగా శనివారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ‘బోళా శంకర్’లోని చిరంజీవి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతదర్శకుడు. ఏప్రిల్ 14న ‘బోళా శంకర్’ని విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు పండగ రోజున ‘నేను ప్యార్‌లోన పాగలే..’ అంటూ ‘రావణాసుర’ చిత్రం కోసం పాట పాడారు రవితేజ. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించగా, స్వయంగా రవితేజ పాడటం విశేషం. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు హర్షవర్థన్ రామేశ్వర్ మ్యూజిక్ డైరెక్టర్. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజిత పొన్నాడ హీరోయిన్లుగా, హీరో సుశాంత్ కీ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఇక సంక్రాంతికి థియేటర్స్‌లోకి వస్తానన్న విషయాన్ని శివరాత్రి రోజున వెల్లడించారు ప్రభాస్. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రాజెక్ట్ కె’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలి సిందే. దీపికా పదుకోన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీ రోల్స్ చేస్తున్నారు. అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు. అలాగే శివరాత్రి రోజునే ‘రామబాణం’ ఫస్ట్ లుక్‌ను వదిలారు గోపీచంద్. ‘లక్ష్యం’, ‘లౌక్యం’ చిత్రాల తర్వాత మూడోసారి హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘రామబాణం’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ చిత్రంలో డింపుల్ హయతి హీరోయిన్గా నటిస్తుండగా, జగపతిబాబు, ఖుష్బూ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఈ వేసవిలో రిలీజ్ కానుంది. ఇక త్వరలోనే మ్యూజిక్ బ్లాస్ట్ ఉంటుందంటున్నారు ‘ఏజెంట్’. అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఏజెంట్’. సాక్షి వైద్య హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ ప్రముఖ హీరో మమ్ముట్టి ఓ కీ రోల్ చేస్తున్నారు. కాగా ‘ఏజెంట్’ ఆడియోను త్వరలోనే విడుదల చేయనున్నట్లు శనివారం ప్రకటించారు మేకర్స్. అనిల్ సుంకర ఏకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమాస్ పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. ‘ఏజెంట్’ చిత్రం ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఇవే కాదు.. అల్లరి నరేశ్ ‘ఉగ్రం’, సాయిధరమ్ ‘విరూపాక్ష’, సందీప్ కిషన్ ‘ఊరు పేరు భైరవకోన’తో పాటు మరికొన్ని చిత్రబృందాలు శివరాత్రి శుభాకాంక్షలు తెలిపాయి. -
అంగన్వాడీల్లో ‘మినీ’ మెనూ
ఇందూరు, న్యూస్‌లైన్ : పౌష్టికాహార లోపంతో బలహీనంగా మారిన పిల్లలను బలిష్టం చేయడానికి రాష్ట్ర ఐసీడీఎస్ అధికారులు చర్యలు చేపట్టారు. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల బరువును పెంచడమే లక్ష్యంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల్లో కొత్త పౌష్టికాహార మెనూకు శ్రీకారం చుట్టారు. అదే మినీ భోజన మెనూ. ఈ కొత్త మెనూ ద్వారా పౌష్టికాహార లోప పిల్లలందరికీ ప్రతిరోజు గుడ్డు, 100 ఎంఎల్ పాలు అందిస్తారు. వీటితో పాటే బియ్యం, పప్పు, పోపు దినుసులు అందజేస్తారు. ఈ మెనూను జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయాలని ఈ మేరకు ఐసీడీఎస్ కమిషనర్ చిరంజీవి చౌదరి జీఓ ఎంఎస్ నం.15 ద్వారా ఉత్తర్వులను జిల్లా ఐసీడీఎస్ కార్యాలయానికి జారీచేశారు. ఈ క్రమంలో జిల్లా ఐసీడీఎస్ పీడీ రాములు కొత్త మెనూ జీఓ కాపీలను అన్ని ప్రాజెక్టుల సీడీపీఓలకు పంపించారు. 7 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు ఎవరైనా పౌష్టికాహార లోపానికి గురైతే వారికి కొత్త మెనూ ప్రకారం పౌష్టికాహార భోజనం అందించాలని, ఈ విషయం అంగన్వాడీ కార్యకర్తలకు తెలియజేయాలని ఆదేశాలు జారీచేశారు. పౌష్టికాహారానికి సంబంధించిన సరుకులు బియ్యం, పప్పు, కూరగాయలు, నూనె, పోపు దినుసులు, అదనపు నూనె, గుడ్లు, పాలు అంగన్వాడీ కేంద్రాలకు పంపిస్తున్నారు. ఈనెల నుంచే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అమలు పర్చాలని పీడీ ఆదేశాలు జారీచేశారు. పిల్లల కోసం సర్వే... జిల్లాలో ఈ పాటికే సుమారుగా రెండు వేల మంది వరకు పిల్లలు పౌష్టికాహార లోపానికి గురైనట్లు అధికారులు గుర్తించారు. వారికి ఆస్పత్రుల్లో చికిత్సలు, అం గన్‌వాడీల్లో పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రస్తుతం వీరికోసం కొత్త మెనూ రావడంతో మరో విడతగా అంగన్వాడీ కార్యకర్తలు సర్వే చేసి పిల్లలను గుర్తించే పనిలో ఉన్నారు. పౌష్టికాహార లోపానికి గురయ్యారో లేదో, పిల్లల ఎత్తుకు తగిన బరును తెలుసుకునేందు కు వారి బరువులను కొలుస్తున్నారు. తక్కువ, అతి తక్కువ బరువు ఉంటే వెంటనే వారి పేర్లను నమోదు చేసుకుంటున్నారు. అలా పేరు నమోదు చేసిన పిల్లలను ఆస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో లేదా పౌష్టికాహారం ఇంటికి పంపించి తినిపిస్తారు. బరువు పెరిగారో లేదోనని వారానికి ఒకసారి వారి బరువు చూస్తారు. పిల్లలకు తినిపించే సమయవేళలు .. పౌష్టికాహార లోపానికి గురైన పిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో మూడుసార్లు ఆహారం అందిస్తారు. ఇంటి వద్ద నాలుగు సార్లు తినిపించాలి. ప్రతిరోజు ఉదయం 9:30 గంటలకు గుడ్డు, 11:30కి 100 ఎంఎల్ పాలు, మధ్యాహ్నం 12 గంటలకు మినీ భోజనం అంగన్వాడీ కేంద్రాల్లో ఇస్తారు. తల్లులు, పిల్లలకు ఇది తినిపించడమే కాకుండా ఇంటి వద్ద అంగన్వాడీ కేంద్రం నుంచి అందించిన బాలామృతం పౌష్టికాహా రం ఉదయం 7:30కి ఒకసారి, సాయంత్రం 5:30 మరోసారి 50 గ్రాముల చొప్పున జావలా చేసి లేదా లడ్డులాగా చేసి తినిపించాలి. అంతే కాకుండా మధ్యాహ్నం 3:30లకు ఉడికించిన కూరగాయలు (ఆలుగడ్డ లాంటివి), పండు గుజ్జులా తయారు చేసి తినిపిం చా లి. రాత్రి 7:30లకు భోజనం పెట్టాలి. ఈ భోజనంలో నెయ్యి లేదా నూనె కలపాలి. పౌష్టికాహార లోపానికి కు గురైన పిల్లలకు ప్రతిరోజు ఈ విధంగా ఆహారం అందించడంలో అంగన్వాడీ కార్యకర్త, తల్లి పూర్తి శ్రద్ధ చూపాలి. పక్కాగా అమలు చేస్తాం పౌష్టికాహార లోపానికి గురైన పిల్లల కోసం జిల్లాలో సర్వే నిర్వహిస్తున్నాం. కొత్త మినీ భోజన మెనూ ప్రకా రం సర్వేలో గుర్తించిన పిల్లలకు పౌష్టికాహారం కచ్చితంగా అందిస్తాం. మెనూను పక్కాగా అమలు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యం చేయరాదని అంగన్వాడీ కార్యకర్తలకు ఆదేశాలు జారీచేశాం. -రాములు, ఐసీడీఎస్, పీడీ