తోటా వీడియో ఆల్బమ్‌ విడుదల 

Thota Music Video Album Launch At Chennai - Sakshi

Thota Music Video Album Launch: తోటా వీడియో ఆల్బమ్‌ను శనివారం సాయంత్రం చెన్నైలో విడుదల చేశారు.  నాయిస్‌ అండ్‌ గ్రెయిన్‌ నుంచి వస్తున్న తాజా వీడియో ఆల్బమ్‌ ఇది. నటుడు రియోరాజ్, రమ్యా పాండియన్‌ జంటగా నటించిన దీనికి బ్రిట్టో జేబీ దర్శకత్వం వహించారు. దేవ్‌ ప్రకా ష్‌ సంగీతాన్ని అందించిన ఈ పాటను ప్రేమ్‌ జీ, నిత్యాశ్రీ పాడారు. శనివారం సాయంత్రం స్థానిక అడయార్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో జరిగిన ఈ వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో నిర్వాహకులు కార్తీక్, మహావీర్‌ మాట్లాడారు.

ఇంతకు ముందు తాము రూపొందించిన కన్నమ్మ పాటకు మంచి ఆదరణ లభించిందన్నారు. దీంతో తోటా పాట కాన్సెప్ట్‌ గురించి నటుడు రియోరాజ్‌ చెప్పడంతో నచ్చి వెంటనే దీన్ని రూపొందించినట్లు తెలిపారు. యువ నటీనటులను ప్రోత్సహిస్తూ అందరినీ అలరించే వీడియో ఆల్బమ్‌ను రూపొందించడమే తమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.  
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top