Malli Modalaindi: TG Keerthi Kumar Comments On Sumanth Movie Deets Inside - Sakshi
Sakshi News home page

Malli Modalaindi: ఆడియన్స్‌ అప్‌డేట్‌ అయ్యారు

Feb 14 2022 9:55 AM | Updated on Feb 14 2022 10:10 AM

TG Keerthi Kumar About Malli Modalaindi Movie - Sakshi

‘‘విడాకులు తీసుకున్న ఓ జంట కథ కొత్తగా మళ్లీ ఎలా మొదలైంది అన్నదే మా ‘మళ్ళీ మొదలైంది’. నా స్నేహితుడి జీవితంలోని కొన్ని సంఘటనలతో ఈ సినిమాను తీశాం..

సుమంత్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మళ్ళీ మొదలైంది’. టీజీ కీర్తీ కుమార్‌ దర్శకత్వంలో రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11 నుంచి జీ 5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ సందర్భంగా టీజీ కీర్తీ కుమార్‌ మాట్లాడుతూ– ‘‘విడాకులు తీసుకున్న ఓ జంట కథ కొత్తగా మళ్లీ ఎలా మొదలైంది అన్నదే మా ‘మళ్ళీ మొదలైంది’. నా స్నేహితుడి జీవితంలోని కొన్ని సంఘటనలతో ఈ సినిమాను తీశాం. ‘నా సర్కిల్‌లో సినిమాకు మంచి స్పందన వస్తోంది’ అని సుమంత్‌ అనడంతో హ్యాపీ ఫీలయ్యాను’’ అన్నారు.

ఇంకా మాట్లాడుతూ – ‘‘ ఆడియన్స్‌ లాక్‌డౌన్‌ సమయంలో ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ వల్ల మరింత అప్‌డేట్‌ అయ్యారు. కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలనే ఇష్టపడుతున్నారు. నేనూ అలాంటి సినిమాలనే తీయాలనుకుంటున్నాను’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement