గుంటూరు కారంతో పోటీ.. హనుమాన్‌ హీరో ట్వీట్‌ వైరల్‌ | Teja Sajja Interesting Comments On Mahesh Babu Guntur Kaaram Movie, Post Goes Viral On Social Media - Sakshi
Sakshi News home page

Teja Sajja On Guntur Kaaram: గుంటూరు కారంతో పోటీ.. హనుమాన్‌ హీరో 'తేజ' ట్వీట్‌ వైరల్‌

Published Tue, Jan 2 2024 11:16 AM

Teja Sajja Comments On Guntur Kaaram Movie - Sakshi

ఈ సంక్రాంతికి సినిమా అభిమానులకు పెద్ద పండుగ ప్రతి ఏడాది మాదిరే ఈసారి కూడా భారీగానే సినిమాలు ఉన్నాయి. ఎన్ని సినిమాలు రేసులో ఉన్నా.. మహేశ్‌ బాబు 'గుంటూరు కారం' చిత్రంపైనే ప్రేక్షకుల గురి ఎక్కువగా ఉంది. మహేశ్‌ బాబు- శ్రీలీల, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో త్రవిక్రమ్‌ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మహేశ్‌- త్రివిక్రమ్‌లకు ఇది హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ కావడంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.  జనవరి 12న గుంటూరు కారం విడుదల కానుంది. అదే రోజున తేజ సజ్జ నటించిన 'హనుమాన్' కూడా విడుదల కానుంది. 

జనవరి 12న ఏకంగా రెండు సినిమాలు ఉండటంతో ఈ పోటీ నుంచి ఎవరైనా ఒకరు తప్పుకొని మరోతేదికి వస్తారనుకుంటే ఎవరూ తగ్గలేదు. ఫైనల్‌గా గుంటూరు కారం,హనుమాన్‌ రెండు చిత్రాలు ఒకేరోజు విడుదల అవుతున్నాయి. దీంతో పలు వెబ్‌సైట్లు మహేష్‌కు పోటీగా తేజ సజ్జ దిగుతున్నాడు అంటూ కొన్ని పోస్టులు పెట్టాయి. వాస్తవానికి మహేష్‌ లాంటి సూపర్‌ స్టార్‌కు తేజ సజ్జ ఎలా పోటీ అవుతాడు..? మహేష్‌కు మాస్‌,ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన నుంచి ఇంత వరకు పాన్‌ ఇండియా సినిమా ఒక్కటి కూడా రాలేదు.. అయినా పాన్‌ ఇండియా హీరోల్లో మహేష్‌ టాప్‌-10 లో ఉండటం విశేషం.

అయితే తేజ సజ్జ ఒక ట్వీట్‌ చేశాడు.  'సూపర్​స్టార్​తో పోటీ ఏంటి సర్.. ఆయనతో పోటీగా కాదు, ఆయనతో పాటుగా' అని ఒక స్క్రీన్‌ షాట్‌కు రిప్లై ఇచ్చాడు. వాస్తవానికి 2000 సంవత్సరంలో  మహేష్‌ బాబుతో 'యువరాజు' అనే సినిమాలో నటించాడు తేజ సజ్జ.. అందులో మహేష్‌కు కుమారుడిగా ఆయన నటించిన విషయం తెలిసిందే. సుమారు 24 ఏళ్ల తర్వాత ఇలా ఇద్దరీ సినిమాలు ఒకేరోజు విడుదల కావడం మరింత విశేషం.​ 

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement