నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా | Tamil Actress Meera Mithun Says, She Wants to Visit Nityananda's Kailasa - Sakshi
Sakshi News home page

నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నా! 

Published Fri, Aug 28 2020 6:21 AM

Tamil Actor Meera Mitun Says She Wants To Visit Nithyananda Kailasa - Sakshi

సాక్షి, చెన్నై: నిత్యానంద కైలాసానికి వెళ్లాలనుకుంటున్నానని నటి మీరామిథున్‌ పేర్కొన్నారు. నటి మీరామిథున్‌ దృష్టి తాజాగా మరో వివాదాస్పద ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే నిత్యానందపై పడింది. నిత్యానంద ఇప్పుడు తనే సొంతంగా కైలాస అనే దేశాన్ని ఏర్పాటు చేసుకుని ఏలుతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు నటి మీరామిథున్‌ ఆయన్ని పొగడ్తలతో ముంచెత్తుతోంది. నిత్యానంద గురించి ఆమె తన ట్విట్టర్లో పేర్కొంటూ అందరూ ఆయన్ని తప్పుగా ప్రచారం చేశారు. త్వరలో తాను నిత్యానంద ఏర్పాటుచేసిన కైలాస దేశానికి వెళ్లాలని కోరుకుంటున్నాను. లాట్స్‌ ఆఫ్‌ లవ్‌ అని మీరా మిథున్‌ పేర్కొంది. (చదవండి: సొంత బ్యాంకు, ప్రత్యేక కరెన్సీ!)

Advertisement
 
Advertisement