సినిమా పూర్తై ఎనిమిదేళ్లు.. ఓటీటీకి వస్తోన్న ప్రశాంత్ వర్మ మూవీ! | Sakshi
Sakshi News home page

Tamannaah Movie: ఎనిమిదేళ్ల తర్వాత ఓటీటీకి తమన్నా చిత్రం!

Published Tue, Jan 2 2024 9:20 AM

Tamannaah Movie That is Mahalakshmi to get direct release In Ott - Sakshi

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా నటించిన చిత్రం ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి . ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని ఇప్పటికే దాదాపు ఎనిమిదేళ్లు పూర్తవుతోంది. అయితే తాజాగా ఈ మూవీ థియేట‌ర్ల‌లో కాకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ చిత్రానికి హనుమాన్ ఫేమ్ ప్రశాంత వర్మ దర్శకత్వం వహించారు. 

కాగా.. కంగన ర‌నౌత్ బాలీవుడ్ మూవీ క్వీన్ ఆధారంగా ద‌టీజ్ మ‌హాల‌క్ష్మి మూవీని 2014లో ప్రకటించారు. 2016లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సౌత్ రీమేక్ రైట్స్ విష‌యంలో నెల‌కొన్న వివాదం కార‌ణంగా రిలీజ్ కాలేదు. సినిమా విడుదల కాకపోవడంతో ఈ సినిమా గురించి ఆడియన్స్ కూడా మర్చిపోయారు. 
 
అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీని డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. సినిమా షూటింగ్‌ పూర్తయి ఇప్పటికే ఎనిమిదేళ్లు కావడంతో థియేటర్లో రిలీజ్ చేస్తే ప్రేక్షకులు ఆదరించడం కష్టమేనని భావించినట్లు తెలుస్తోంది. అందుకే నెట్‌ఫ్లిక్స్ తో నిర్మాతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే త్వరలోనే ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌ తేదీపై క్లారిటీ రానుంది. కాగా.. ఈ చిత్రంలో డీజే టిల్లు ఫేమ్ సిద్దు జొన్నల‌గ‌డ్డ కీల‌క పాత్రలో కనిపించారు. అయితే గతంలోనూ ఈ మూవీ అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు వార్తలొచ్చాయి. 


 

Advertisement
Advertisement